జయ మరణ వార్త విని కృష్ణ, విజయనిర్మల దిగ్భ్రాంతికి గురయ్యారు: నటుడు నరేష్

  • నిన్న రాత్రి మరణించిన దర్శకురాలు జయ
  • ఈ ఉదయం కృష్ణకు వార్త చెప్పిన కుటుంబీకులు
  • షాక్ నకు గురయ్యారన్న నరేష్
దర్శకురాలు బి. జయ హఠాన్మరణ వార్తను విని కృష్ణ, విజయనిర్మల దిగ్భ్రాంతికి గురయ్యారని నటుడు నరేష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బీఏ రాజు ఇంటికి వచ్చి జయ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఈ ఉదయం కృష్ణకు విషయం తెలిసిందని, ఆ వెంటనే ఆయన షాక్ నకు గురయ్యారని చెప్పారు. బీఏ రాజు కుటుంబానికి, ఘట్టమనేని కుటుంబానికీ ఎంతో దగ్గర అనుబంధముందని, తనకు ఓ సోదరి లాంటి జయ మరణవార్తను జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. ఇండస్ట్రీకి ఆమె మరణం తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
Jaya
Director
Naresh
Krishna
Vijayanirmala

More Telugu News